ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Petrol-attack-on-young-boy

ETV Bharat / videos

Petrol attack on young man అన్నమయ్య జిల్లాలో దారుణం..! బాలికతో మాట్లాడుతున్నాడని యువకుడిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన దుండగులు - Petrol attack on young man

By

Published : Aug 7, 2023, 5:49 PM IST

Petrol attack on young man in Annamayya district: బాలికతో మాట్లాడుతున్నాడని అక్కసుతో ఓ యువకునిపై గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. పోలీసులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మదనపల్లె రూరల్ డ్రైవర్స్ కాలనీకి చెందిన ముస్తక్ అహ్మద్ కుమారుడు అల్తాఫ్(19) పుంగనూరు సమీపంలోని చీనే పల్లె మదరసాలో చదువుతున్నాడు. సెలవుపై అతను డ్రైవర్స్ కాలనీలో ఉన్న ఇంటికి వచ్చాడు. సోమవారం పాఠశాలకు వెళ్లాలని బస్సులో వెళుతుండగా పుంగనూరు సమీపంలో ముగ్గురు యువకులు అల్తాఫ్​ను బస్సు నుంచి కిందకు దించి తమ ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు తీసుకొచ్చారు. అనంతరం డ్రైవర్స్ కాలనీకి చెందిన ఓ బాలికతో అల్తాఫ్ మాట్లాడుతున్నాడని కోపంతో అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. బాధితుడు కాలిన గాయాలతో ఇంటికి వెళ్లాగా.. కుటుంబ సభ్యులు అతన్ని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అల్తాఫ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రిఫర్ చేశారు. విషయం తెలుసుకున్న మదనపల్లి డిఎస్పీ కేశప్పతోపాటు సిఐలు ఆసుపత్రి వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details