ఆంధ్రప్రదేశ్

andhra pradesh

perni_nani_complaint_to_collector_on_voter_list

ETV Bharat / videos

'2019 నుంచి ఒకే ఓటర్​ లిస్టు - 15 వేల మందికి తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు' - ఓటర్​ లిస్టు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 7:13 PM IST

Perni Nani Complaint to Collector On Voter List :కృష్ణాజిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలోనే 15 వేల మందికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారని  పేర్ని నాని అన్నారు. ఈ ఓట్లు అన్నీ కూడా గత ప్రభుత్వం హయాంలోనే నమోదు చేశారని పేర్ని నాని ఆరోపించారు. వీటన్నింటిపై విచారణ చేపట్టి దొంగ ఓట్లను తొలగించాలని కలెక్టర్ ను కోరారు.

Perni Nani On Voter List :  2019 నుంచి ఒకే ఓటర్​ లిస్టు కొనసాగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఈ విషయమై ఆయన జిల్లా కలెక్టర్​కు దొంగ ఓట్ల వివరాలు సమర్పించానన్నారు. ఈ క్రమంలో ఓటర్​ లిస్టులో ఉన్న అవకతవకలను సరి చేయించాలని కోరానన్నారు. ఓటర్ల నమోదు పారదర్శకంగా జరగాలని తన ఉద్దేశమని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details