ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Parliamentary_Standing_Committee_Chairman_Visited_Sachivalayams

ETV Bharat / videos

విశాఖలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పర్యటన.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా! - ఏపీ సచివాలయాల వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 9:53 PM IST

Parliamentary Standing Committee Chairman Visited Sachivalayam: విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని సచివాలయాలను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సందర్శించారు. చైర్మన్ కరుణానిధితో పాటు 28 మంది పార్లమెంట్ సభ్యులు పర్యటించారు. ఆనందపురం మండలం రెడ్డిపల్లిలో ఎంపీల బృందం పర్యటించారు. అలానే గ్రామ సచివాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. గ్రామీణాభివృద్ధి పథకాలు అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా గ్రూపు సభ్యులుగా వారి అనుభవాన్ని సభలో వివరించారు. మహిళలు చెబుతున్న విషయాలను జిల్లా అధికారులు పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ వారికి హిందీలోకి అనువాదం చేశారు. ఈ కార్యక్రమానికి ముందు రెడ్డిపల్లిలో 2.5 ఎకరాల్లో పండించిన సపోటా తోటను పరిశీలించారు. ఎంపీపీ రాంబాబు, జడ్పిటిసి ఎస్ గిరిబాబు, ఎంపీడీవో లవరాజు,విజయ్ కుమార్​లు తహశీల్దార్ రామారావు, శ్రీ వల్లిలు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details