ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Paritala_ Sriram_ Fire_ On_ MLA_ Kethireddy

ETV Bharat / videos

Paritala Sriram Fire On MLA Kethireddy :''గుడ్ మార్నింగ్ పేరుతో పర్యటనలు చేసే ఎమ్మెల్యేకు చెట్ల నరికివేత కనిపించడం లేదా'' - Sri Sathya Sai District Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 3:23 PM IST

Paritala Sriram Fire On MLA Kethireddy : వైసీపీ పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా తాడిమర్రి మండలంలో తెలుగుదేశం పార్టీ వర్గీయులకు చెందిన చీని చెట్లు నరికివేత వరుస ఘటనలు జరుగుతున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని.. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. తాడిమర్రిలో తెలుగుదేశం పార్టీకి చెందిన గణేష్ వ్యవసాయ తోటలో వైసీపీ వర్గీయులు చీని చెట్లను నరికేశారు. ఘటన స్థలాన్ని పరిటాల శ్రీరామ్ పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గణేష్ వ్యవసాయ తోటలో ఈ ఘటన జరగడం రెండోసారి అని పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. గుడ్ మార్నింగ్ పేరున పర్యటనలు చేసే ఎమ్మెల్యేకు చెట్ల నరికివేత కనిపించడం లేదా అని పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు. చెట్లు నరికే విశ్వసంస్కృతి మంచిది కాదన్నారు. రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచి పోరాటాలు చేస్తుందన్నారు. పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details