Panchayat Raj Chamber Condemns Attack on Sarpanch సర్పంచ్‌పై దాడి చేసిన సీఐని సస్పెండ్ చేయాలి..లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 11:28 AM IST
|Updated : Sep 1, 2023, 2:15 PM IST
Panchayat Raj Chamber Condemns CI Attack on Sarpanch :చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కోకా ప్రకాష్ నాయుడుపై పోలీసుల దాడిని పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ తీవ్రంగా ఖండించారు. కోకా ప్రకాష్ నాయుడుపై దాడి చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ని వెంటనే సస్పెండ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.
Police Attack on Sarpanch Association President :రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన తమ గ్రామ పంచాయతీ నిధులు తమకు ఇవ్వమని అడిగితే పోలీసులతో బంగారు పాల్యం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సర్పంచుల సమస్యలు చెప్పుకోవడానికి వస్తే తమ సర్పంచ్ పై సీఐ దాడి చేయడం అమానుషమన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన తమ సర్పంచులు మండల పరిషత్ సమావేశంలో తమ సమస్యలు చెప్పుకోవడం రాజ్యాంగం తమకు కల్పించిన హక్కు- ఆ హక్కును ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందని దుయ్యబట్టారు.
కోకా ప్రకాష్ నాయుడుకి ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. తమ సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షునిపై దాడి చేయిస్తారా అంటూ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12918 మంది సర్పంచులు రాజకీయాలకతీతంగా ఐక్యమై తమసమస్యలపై పోరాడి, తమ గ్రామాల్ని అభివృద్ధి చేసి, తమని నమ్మి తమకు ఓటు వేసిన తమ గ్రామీణ ప్రజల రుణం తీర్చుకుంటామని లక్ష్మీ ముత్యాలరావు తెలిపారు.