ఆంధ్రప్రదేశ్

andhra pradesh

One killed in a clash between Two Groups During Ganesha Mandapam

ETV Bharat / videos

One killed At Ganesha Pooja Celebrations వినాయక మండపం వద్ద ఆకతాయి చేష్టలు.. వారించినవారితో ఘర్షణ.. వ్యక్తి మృతి - ఏపీ క్రైం వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 5:10 PM IST

One killed in a clash between Two Groups During Ganesha Mandapam:ఆ యువకుల ఆకతాయి చేష్టలకు వినాయక మండపం వద్ద గొడవ మెుదలైంది.. మెల్లగా మెుదలైన వివాదం... చిలికి చిలికి గాలివానాలా మారింది. ఇరువర్గాల మధ్యజరిగిన ఘర్షణల్లో ఓ వ్యక్తి మృతి చెందగా... ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన  సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం దొరి గిల్లు క్వార్టర్స్​లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  గణేష్ మండపం వద్ద జరిగిన ఘర్షణలో అనంతయ్య 52 అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  దొరి గిల్లులో పక్క గ్రామం యువకులు ద్విచక్ర వాహనంలో వేగంగా తిరగడంతో స్థానికులు ఆ యువకులను  అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో యువకులకి గ్రామస్థులకు  మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ గ్రామంలోకి వెళ్లిన యువకులు... మరికొంత మందిని వెంటేసుకొని వచ్చి  దొరి గిల్లు క్వార్టర్స్ వినాయక మండపం వద్ద ఉన్నవారిపై దాడికి తెగబడ్డారు.  ఈ ఘటనలో అనంతయ్య అనే వ్యక్తి మృతి చెందగా... మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు చల్లచదురుగా పడిపోయారు. వారిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న  డీఎస్పీ శ్రీనివాసులు ఘటన ప్రదేశాన్ని  పరిశీలించారు. అనంతరం ఘర్షణలకు గల కారణాలపై  విచారణ చేపట్టారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details