ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

video thumbnail
Nara_Bhuvaneshwari_Emotional_Tweet_on_NTR

ETV Bharat / videos

Nara Bhuvaneshwari Emotional Tweet on NTR: నాన్న జ్ఞాపకాలతో నా హృదయం నిండిపోయింది.. ఎన్టీఆర్​పై నారా భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్ - Nara Bhuvaneshwari Nirashana Diksha

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2023, 5:44 PM IST

Nara Bhuvaneshwari Emotional Tweet on NTR: తండ్రి ఎన్టీఆర్ జ్ఞాపకాలతో తన హృదయం నిండిపోయిందంటూ.. నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు. తెలుగుజాతి కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారంటూ కొనియాడారు. సత్యం ఎంత కఠినంగా ఉన్నా.. ఎప్పుడూ కట్టుబడి ఉండాలని ఎన్టీఆర్ బోధించారని గుర్తు చేసుకున్నారు. న్యాయం కోసం ఎన్టీఆర్ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని భువనేశ్వరి అన్నారు. తెలుగువారికి సేవ చేయడంలో ఎన్టీఆర్ చూపిన అంకితభావం.. ప్రజలందరితో పాటు ఆయన పిల్లలైన తమకూ ఆదర్శమని అన్నారు. ఇదిలా ఉండగా.. నైపుణ్యాభివృద్ధి కేసులో అక్రమ అరెస్టును నిరసిస్తూ రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరశన దీక్ష చేపట్టారు. తమకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో గాంధీ జయంతి రోజున 'సత్యమేవ జయతే' పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, రాజానగరం నియోజకవర్గాల నుంచి వేలాది మహిళలు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భువనేశ్వరి.. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల బాగు కోసమే పరితపించారని.. నా తండ్రి, భర్త అధికారంలో ఉన్నా ఎప్పుడూ అవినీతి చేయలేదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details