ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nadendla Manohar Fires on Guntur Mayor

ETV Bharat / videos

Nadendla Manohar Fires on Guntur Mayor: గుంటూరు మేయర్​పై చర్యలు తీసుకోవాలి.. లేకపోతే సుప్రీంకోర్టుకెళ్తాం: నాదెండ్ల మనోహర్‌ - Guntur Mayor

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2023, 5:35 PM IST

Nadendla Manohar Fires on Guntur Mayor: పవన్ కల్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంటూరు వైసీపీ నేతపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. నిన్న గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సుప్రీం కోర్టు తీర్పు ధిక్కరణ కిందకు వస్తోందన్నారు. ఎస్పీ తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోని పక్షంలో జనసేన తరపున సుప్రీంకోర్టుకు వెళ్తామని మనోహర్ స్పష్టం చేశారు. 

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సోమవారం జనసేన శాంతియుత ఆందోళనకు పిలుపునివ్వగా.. వైసీపీ నాయకులు వ్యవహారించిన తీరు బాధాకరమని పేర్కొన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పించేలా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరినా.. ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాయడం సరికాదన్నారు. అయితే పవన్ కల్యాణ్​పై అనుచిత వ్యాఖ్యలు (Guntur Mayor comments on Pawan Kalyan) చేసిన మేయర్ కావటి మనోహర్ ఇంటిని ముట్టడించేందుకు నేడు జనసేన నేతలు పిలుపునిచ్చారు. దీంతో పలువురు జనసేన నేతల్ని ఎక్కడికక్కడ గృహానిర్బంధించారు. దీనిపై మనోహర్ నాయుడు మీద చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్​కి.. జనసేన ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు ఫిర్యాదు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details