ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Municipal Employees Mahasabha

ETV Bharat / videos

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు- ఉద్యమం వైపు వెళ్లేలా చేయవద్దు: బొప్పరాజు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2023, 10:23 AM IST

Municipal Employees Mahasabha: ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో జాప్యం చేసి ఉద్యమం వైపు నెట్టవద్దని ఎపీ జెఏసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కొరారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని బొప్పరాజు పేర్కొన్నారు.  జీపీఎఫ్ మొత్తం నుంచి కుటుంబ అవసరాలకు పెట్టుకున్న లోన్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.  గతంలో ఇచ్చిన హామీలపై ఇప్పటి వరకూ దిక్కుమెుక్కు లేదని ఆరోపించారు. గత 2018 నుంచి డీఏ బకాయిలు ఇస్తామని మోసం చేశారని తెలిపారు. పీఆర్సీ బకాయిలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఇవ్వలేదని ఆరోపించారు. పీఆర్సీ కమిటీ వేసి 7 నెలలు కావస్తుందని ఇప్పటి వరకూ చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు అన్ని గమనిస్తున్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  

 జనవరి 7న మున్సిపల్ ఉద్యోగుల రాష్ట్ర మహా సభను విశాఖలో నిర్వహించనున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ ఉద్యోగులను ఒక తాటిపైకి తెచ్చి వారి సమస్యలు పరిష్కానికి కోసమే ఒక వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తద్వారా ప్రభుత్వం దృష్టికి మున్సిపల్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు  తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అందుకోసమే జనవరి 7న రాష్ట్రస్దాయిలో మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోషియేషన్ మొదటి రాష్ట్రమహాసభను నిర్వహిస్తున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details