ఆంధ్రప్రదేశ్

andhra pradesh

raghuramakrishna_raju_on_ycp_govt

ETV Bharat / videos

జగన్ సొంత వర్గానికే కీలక పదవులు కట్టబెట్టారు - సామాజిక బస్సు యాత్ర చేస్తూ ఏం సందేశమిస్తున్నారు? : రఘురామ - AP Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 7:15 PM IST

MP Raghu Rama krishna Raju Allegations on YCP Govt:వైసీపీ ప్రభుత్వ తీరుపై ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghuramakrishna Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన సొంత సామాజిక వర్గానికే కీలక పదవులు కట్టబెట్టి.. సామాజిక బస్సు యాత్ర చేస్తూ ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో వివిధ సర్వీసులలో పని చేస్తున్న రెడ్డి వర్గీయులను అందలమెక్కించారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కేవలం రెడ్డి వర్గానికే కీలక పదవులు కట్టబెట్టి.. బస్సు యాత్ర చేస్తూ ఏం ప్రజలకు సందేశమిస్తున్నారని ఆరోపించారు. 

కేవలం రెడ్డి వర్గీయులకు రాష్ట్రంలో కీలక పదవులను ఇవ్వడమేనా సామాజిక న్యాయమని ప్రశ్నించారు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని సామాజిక బస్సు యాత్రలో సుత్తి కబుర్లు చెప్పి వారిపై ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్నారని రఘురామ విమర్శించారు. వైసీపీ చెపట్టిన బస్సు యాత్ర కాస్త తుస్సు యాత్రగా మారిందని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details