Bro Movie Team in Tirupati: తిరుపతిలో 'బ్రో' యూనిట్ సందడి.. పెళ్లి గురించి సాయితేజ్ ఏం అన్నాడంటే..? - తిరుపతిలో బ్రో సినిమా ప్రమోషన్స్
Bro Movie Team in Tirupati: తిరుపతిలో 'బ్రో' మూవీ టీం సందడి చేసింది. 'బ్రో' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జయశ్యాం థియేటర్‌కు హీరో సాయిధరమ్ తేజ్, చిత్ర దర్శకుడు సముద్రఖని విచ్చేశారు. దీంతో ధియోటర్ వద్దకు చేరుకున్న సాయితేజ్ అభిమానులు.. టపాకాయలు పేల్చి స్వాగతం పలికారు. కేకలు, కేరింతలతో థియేటర్ మొత్తం మార్మోగింది. ఈ సందర్భంగా 'బ్రో' సినిమాలోని 'జానవులే' అనే సాంగ్‌ను సాయితేజ్ విడుదల చేశారు. 'బ్రో' సినిమాలో పవన్ కల్యాణ్ ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా ఉన్నారని సాయితేజ్ తెలిపారు. ఈనెల 28న బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని.. ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని కోరుతున్నట్లు సాయితేజ్ అన్నారు. తిరుపతిలో చాలామంది హెల్మెట్ పెట్టుకోవడం లేదని.. ప్రతి ఒక్కరి ప్రేమ తనకు కావాలని అందుకే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలని కోరారు. అదేవిధంగా అభిమానులు పెళ్లి గురించి అడగగా.. ఫన్నీగా సమాధానం చెప్పాడు. 'బ్రో' సినిమాలో పవన్ కల్యాణ్ నటించడం చాలా సంతోషంగా ఉందని చిత్ర దర్శకుడు సముద్రఖని అన్నారు. తన జీవితంలో ఈ సినిమాను మరిచిపోనని.. సినిమా కోసం వేచి చూస్తున్నానని అన్నారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని సినీ నటుడు సాయితేజ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు, నిర్మాత సముద్రఖనితో కలిసి స్వామివారి సేవలో తేజ్ పాల్గొన్నారు.