ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MLC_Bhumireddy_Ramgopal_Reddy_Fires_on_CM_Jagan

ETV Bharat / videos

'వారి' పైన శ్రద్ధ పెట్టకుండా రైతులపై సీఎం జగన్ దృష్టి పెట్టాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి - సీఎం జగన్‌పై టీడీపీ నేతలు ఫైర్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 3:53 PM IST

MLC Bhumireddy Ramgopal Reddy Fires on CM Jagan: ముఖ్యమంత్రి గారు కడప జిల్లాను కరవు మండలాలుగా ప్రకటించాలని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేశ్, రామోజీరావుపైన ఎలా అక్రమ కేసులు పెట్టాలా అని.. తన వ్యక్తిగత కక్షలు ఎలా తీర్చుకోవాలా అనే దానిపై ఉన్న శ్రద్ధ రాయలసీమ వ్యవసాయం, రైతులపైన సీఎం జగన్ దృష్టి పెట్టాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి అవలంబిస్తున్న అస్తవ్యస్త విధానాల వల్ల రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని మండిపడ్డారు. 

కడప జిల్లాలో 33 మండలాలకు గాను ఒక్క మండలం కూడా కరవు మండలంగా ప్రకటించలేదంటే.. సొంత జిల్లా పైన జగన్​కు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2019 వరకు ఫసల్ బీమా యోజన కింద పంట విత్తక పోయినా 25% డబ్బులు నష్టపరిహారం కింద వచ్చేదని.. ప్రస్తుతం ఫసల్ బీమా యోజన నుంచి ఈ ప్రభుత్వం బయటకు వచ్చిందని.. అందువల్లే రైతులకు పూర్తిగా నష్టం జరుగుతుందన్నారు. రాయలసీమ రైతన్నలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని.. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని రాంగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details