ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MLA_Kondeti_Chittibabu_React_on_MLA_Ticket

ETV Bharat / videos

నా లాగా ఏ ఎమ్మెల్యే కష్టపడలేదు - పి.గన్నవరం టికెట్ నాదే : కొండేటి - YSRCP Survey Leak

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 12:50 PM IST

MLA Kondeti Chittibabu React on MLA Ticket :రాష్ట్రంలో తన మాదిరిగా మరే ఎమ్మెల్యే కూడా పార్టీ కోసం కష్టపడలేదని నిత్యం ప్రజల మధ్య ఉన్న తనకే పార్టీ మరోసారి టికెట్‌ ఇస్తుందన్న నమ్మకం ఉందని కోనసీమ జిల్లా పి.గన్నవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. ఈసారి వైఎస్సార్సీపీ తరఫున ఆయనకు టికెట్‌ రాదంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. సీఎం జగన్​పై పూర్తి విశ్వాసం ఉందని, టికెట్‌ ఇస్తారని నూరు శాతం నమ్ముతున్నాని చిట్టిబాబు స్పష్టం చేశారు.

YSRCP MLA Kondeti Chittibabu Comments On AP Election Survey 2024 :గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నియోజకవర్గంలో 269 రోజుల పాటు నిర్వహించానని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలిపారు. సర్వేలో ఏముందో, ఎలా చేశారో తనకు తెలియదని, ఇప్పటికిప్పుడు కొత్త వ్యక్తిని తీసుకొస్తే వారితో కేడర్‌ ఇమడలేదని అన్నారు. టికెట్‌ రాకపోతే పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, సంవత్సరంలో 350 రోజుల పాటు ప్రజలతోనే ఉన్నానని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో 23వేల ఓట్ల మెజార్టీతో నెగ్గానని, ఈసారి 30 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చిట్టిబాబుకు టికెట్ రాదన్న ప్రచారాలపై పార్టీ కేడర్ అసహనం వ్యక్తం చేసింది. పార్టీ కేడర్‌ రాజధాని అమరావతిలోని తాడేపల్లికి వెళ్లి ప్రాంతీయ సమన్వయకర్త మిథున్‌రెడ్డిని కలిసి చిట్టిబాబుకే టికెట్‌ కేటాయించాలని కోరింది. చిట్టిబాబుకు టికెట్ట్ రాకపోతే రాజీనామాలు చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. మిథున్‌రెడ్డిని కలవాలని పార్టీ కేడర్‌కు చిట్టిబాబు సూచించలేదని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details