Minister RK Roja Dance in Shilparamam opening మంత్రి రోజా కోలాట నృత్యం.. గుంటూరులో శిల్పారామం ప్రారంభం - శిల్పారామాన్ని ప్రారంభించిన రోజా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 14, 2023, 10:35 PM IST
రాష్ట్రంలో మరో 17జిల్లాల్లో శిల్పారామాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. గుంటూరులో రింగురోడ్డులో నిర్మించిన శిల్పారామాన్ని ఆమె ప్రారంభించారు. తెలుగుదేశం హయాంలో ఈ శిల్పారామం పనులు 90శాతం పూర్తికాగా... మిగతా 10శాతం పూర్తి చేయటానికి వైసీపీ ప్రభుత్వానికి నాలుగున్నరేళ్లు పట్టింది. మొత్తం 4.56కోట్లు వ్యయం కాగా... కేంద్రం కోటి 56 లక్షలు ఇచ్చింది. రాష్ట్రంలో 9వ శిల్పారామాన్ని ఇవాళ ప్రారంభించామని... మిగతా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు భూమి కేటాయిస్తే కొత్తవాటిని నిర్మిస్తామని రోజా తెలిపారు. మన సంప్రదాయాల్ని కాపాడటం, చేతివృత్తిల్ని పరిరక్షించేందుకు శిల్పారామాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి రోజా కోలాట నృత్యం చేశారు. ఇదే వేదికపై అబ్దుల్ కలాం జయంతి వేడుకల్ని నిర్వహించారు. అబ్దుల్ కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు పైకి ఎదగాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహితలను మంత్రి రోజా, అధికారులు సన్మానించారు.