ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మంత్రి అమర్నాథ్ ద్వంద్వ వ్యాఖ్యలు

ETV Bharat / videos

Minister Amarnath రిషికొండ బీచ్​ సందర్శనకు రూ.20 ఫీజు!... ఆ 20 నిమిషాల్లో ఏం జరిగింది! - బ్లూ ఫ్లాగ్

By

Published : Jul 9, 2023, 5:33 PM IST

Updated : Jul 9, 2023, 9:32 PM IST

Minister Amarnath Double Statement: విశాఖలోని రిషి కొండ బీచ్​లో ప్రవేశానికి రూ.20 ఫీజు నిర్ణయించారనే విషయమై మంత్రి అమర్నాథ్ ద్వంద్వ వ్యాఖ్యలు చేశారు. రిషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉంది. జియెగ్రాఫికల్ ఐడెంటిటీ (జీఐ) కలిగిన ఈ బీచ్ నిర్వహణ, ఆ గుర్తింపును మరింతగా మెయింటెయిన్ చేయాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ ఫీజు పెట్టాలని నిర్ణయించి ఉండొచ్చన్న ఆయన.. మరో 20 నిమిషాల్లో మీడియా ముందుకొచ్చి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మంత్రి అమర్నాథ్ ముందుగా విశాఖ సర్క్యూట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ బీచ్ నిర్వహణకు రుసుము అవసరం ఉందని మాట్లాడారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ రుషి కొండా బీచ్ కు ప్రవేశ రుసుము అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే నిధులు వెచ్చిస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరు వల్ల ఫీజు నిర్ణాయక అంశం చర్చకు వచ్చిందని చెప్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదని తెలిపారు.

Last Updated : Jul 9, 2023, 9:32 PM IST

ABOUT THE AUTHOR

...view details