ఆంధ్రప్రదేశ్

andhra pradesh

minister_adimulapu_suresh_supportive_leaders_drama_in_prakasam

ETV Bharat / videos

వైఎస్సార్​సీపీ నేతల మూకుమ్మడి రాజీనామా - 'అదంతా డ్రామా' - మంత్రి ఆదిమూలపు సురేష్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 1:15 PM IST

Minister Adimulapu Suresh supportive leaders Drama In Prakasam District : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేష్​ను ఇంఛార్జిగా కొనసాగించాలని నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు కొత్త నాటకానికి తెరలేపారు. వైసీపీ ఇంచార్జీల మార్పు ప్రకటించినప్పటి నుంచి 3 రోజుల వరకు ఎవరూ పట్టించుకోకుండా ఇప్పటికిప్పుడు నాయకులు రాజీనామాలు చేస్తామని స్వరం వినిపించారు. ఈ తతంగమంతా మంత్రి సురేష్‌ వెనుక ఉండి నడిపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

MLA Adimulapu Suresh  Latest News :నియోజకవర్గ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులం అందరం మూకుమ్మడిగా రాజీనామా చెేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ప్రజలు కూడా ఆదిమూలపు సురేష్​ కాకుండా మరే ఎమ్మెల్యేను ఇక్కడ ఆమోదించలేరని అన్నారు. వెంటనే అధిష్టానం వారి మనవిని ఆలకించాలని కోరారు. ఆదిమూలపు సురేష్​ను కొండెపి ఇంఛార్జ్​గా నియమించడంపై వారు అసమ్మతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి సురేష్​ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని నాయకులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details