కారులో వచ్చాడు- తుపాకీతో కాల్చాడు- పారిపోయాడు - తుపాకీతో కాల్చి హత్య
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 12:53 PM IST
Man Died With Gun Shot In East Godavari District : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో దారుణ హత్య జరిగింది. దస్తావేజుల లేఖరి సహాయకుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. పుల్లలపాడుకు చెందిన 60 ఏళ్ల కాట్రగడ్డ ప్రభాకర్... అనంతపల్లి రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజుల లేఖరికి సహాయకుడిగా పనిచేస్తున్నారు. ఆయన ఇంటి వద్ద ఉండగా.. మంగళవారం సాయంత్రం 6 గంటల 20 నిమిషాల సమయంలో... గుర్తుతెలియని వ్యక్తి కారులో వచ్చి... ప్రభాకర్‌తో ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడాడు.
Murder With Gun In Andra Pradesh Today :మాట్లాడుతున్న సమయంలోతుపాకీ గురిపెట్టి ప్రభాకర్ ఛాతీపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తుపాకీ శబ్దం విన్న ప్రభాకర్ భార్య ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి... దుండగుడు కారులో పరారయ్యాడు. ప్రభాకర్ రక్తపు మడుగులో పడి ప్రాణాలొదిలారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... విచారణ చేపట్టారు. కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రభాకర్‌కు పరిచయమున్న వ్యక్తే ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.