రైతు భరోసా కేంద్రానికి ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - భయాందోళనలో గ్రామస్థులు - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 3:22 PM IST
Man Commits Suicide at Rythu Bharosa Kendram:నూతనంగా నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా డోన్ మండలంలోని వెంకటాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని వెంకటాపురం గ్రామానికి శివారులో రైతు భరోసా కేంద్రంను నూతనంగా నిర్మిస్తున్నారు. భవనం ఇంకా నిర్మాణ దశలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి భవన స్లాబ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రెపింది.
నిర్మాణ దశలో ఉన్న భవనములో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామస్థులు నిర్ఘాంతపోయారు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులకు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థులు చెప్పిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మృతుడు గత మూడు రోజులుగా గ్రామంలో తిరుగుతుండే వాడని గ్రామస్థులు పోలీసులకు తెలిపారు.