ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lorry_Driver_Drunk_and_Drive_in_Nellore_District

ETV Bharat / videos

బైపాస్ కాబట్టి సరిపోయింది! ఆ లారీ పట్టణంలోకి వస్తే? - మద్యం మత్తులో స్టీరింగ్​పై పడిపోయిన డ్రైవర్ - ఏపీ లేటెస్ట్ న్యూస్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 3:17 PM IST

Lorry Driver Drunk and Drive in Nellore District: నెల్లూరు జిల్లా ఆత్మకూరు బైపాస్ రోడ్డులో.. ఓ డ్రైవర్ మద్యం మత్తులో లారీని నడుపుతూ భయాందోళన సృష్టించాడు. నెల్లూరుకు చెందిన శేషాద్రి.. లారీ నడుపుతూ.. అకస్మాత్తుగా నడిరోడ్డుపై వాహనాన్ని నిలిపి.. స్టీరింగ్‌పైనే వాలిపోతూ స్పృహ కోల్పోయాడు. దీన్ని గమనించిన స్థానికులు.. లారీ ఇంజిన్ ఆఫ్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్.. డ్రైవర్ పరిస్థితిని చూసి.. అనారోగ్య కారణాలేమైనా ఉన్నాయా..? లేక మద్యం మత్తులో ఉన్నాడో అర్థంకాక 108 అంబులెన్సుకు కాల్ చేశారు. 

దీంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది.. డ్రైవర్ కండీషన్ పరిశీలించి.. మద్యం మత్తులో ఉన్నాడని.. అనారోగ్య సమస్యలేదని చెప్పి వెళ్లిపోయారు. డ్రైవర్‌తో సహా లారీని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. డ్రైవర్ లారీకి సడన్​గా బ్రేక్ వేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details