Lokesh Yuvagalam Padayatra: లోకేశ్‌కు హారతిపట్టిన విజయవాడ.. కృష్ణమ్మ ఒడిలో 200 పడవలతో పాదయాత్రకు ఘన స్వాగతం
Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గుంటూరు జిల్లాలో ముగించుకుని నేడు ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. లోకేశ్ పాదయాత్ర ప్రకాశం బ్యారేజ్ మీదుగా జిల్లాలోకి ప్రవేశించింది. పరవళ్లు తొక్కుతున్న కృష్ణా నదిపై యువనేత నారా లోకేశ్ ఘనస్వాగతం అంటూ బోట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా ఆహ్వానం పలికారు. 2019 నుంచి ఇసుక పడవలను కృష్ణా నదిపై తిరగడాన్ని రద్దుచేయడాన్ని నిరసిస్తూ... తెలుగుదేశం అధికారంలోకి వస్తే తమ సమస్య పరిష్కారించాలంటూ ఈ మేరకు పడవల ప్రదర్శన చేపట్టారు. దాదాపు 200 పడవలతో గుంటూరు జిల్లాలోని కొండవీటి వాగు నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ వరకు యువగళం జెండాలతో నిండిపోయింది. ప్రకాశం బ్యారేజ్ అంతటా కూడా లోకేశ్‌కు స్వాగత ఫ్లెక్సీలతో నిండిపోయింది. కేశినేని చిన్ని భారీ ఫ్లెక్సీలతో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న లోకేశ్‌కు స్వాగత ఏర్పాట్లు పరిశీలించి స్వాగతం పలికారు.