Lokesh Reaction టెన్త్ స్టూడెంట్ను తగులబెట్టిన ఘటనను..డీజీపీ ఐపీఎస్ కోణంలో చూడాలి: లోకేశ్ - బాపట్ల జిల్లా టెన్త్ క్లాస్ అబ్బాయి అమర్ నాథ్
10th Class Student Amaranth Brutal Murder: టెన్త్ క్లాస్ అబ్బాయి అమర్ నాథ్‌ని తగలబెట్టిన ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ ద్వారా లోకేశ్ స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, క్రైమ్ రేట్ పెరగలేదని నిన్ననే డీజీపీ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే, వైసీపీ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డి టెన్త్ క్లాస్ అబ్బాయి అమర్ నాథ్‌ని అత్యంత దారుణంగా కొట్టి తగలబెట్టాడని నారా లోకేశ్ దుయ్యబట్టారు. డీజీపీ దృష్టి లో జరిగిన ఘోరం నేరం కాదా అని నిలదీశారు. తన అక్కని వేధిస్తున్న వైసీపీ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డిని నిలదీయడమేనా బీసీ బాలుడు అమర్నాథ్ చేసిన పాపమని నిలదీశారు.
రాష్ట డీజీపీ.. వైసీపీ బుద్ధితో కాకుండా ఐపీఎస్ బుద్ధితో చూడాలని హితవు పలికారు. రాష్ట్రంలో జరిగినన్ని దారుణాలు పాత బీహార్‌లోనూ జరిగి ఉండవని ధ్వజమెత్తారు. సీఎం నియోజకవర్గంలో దళితుడు కృష్ణయ్య హత్య, సీఎం జిల్లాలో దళిత మహిళ నాగమ్మపై హత్యాచారం, సీఎం ఇంటి పక్కనే గ్యాంగ్ రేప్, నెల్లూరులో పట్టపగలే యువతి పై రేప్, ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్ ఈ దారుణమైన నేరాలు-ఘోరాలు డీజిపి కంటికి వైసీపీ పాలనలో చేపడుతున్న స్వచ్ఛందసేవా కార్యక్రమాల్లా కనిపించడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యమని లోకేశ్ మండిపడ్డారు. జగన్ పాలనలో ఏపీ క్రైం క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందని లోకేశ్ ధ్వజమెత్తారు.