ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lokesh promises to restore privileges of BCs

ETV Bharat / videos

Lokesh promises to restore privileges of BCs: బీసీలకు గతంలో అమలుచేసిన అన్ని పథకాలను తిరిగి ప్రారంభిస్తాం... - బీసీ సంఘాల ప్రతినిధులతో లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 7:09 PM IST

 Lokesh promises to restore privileges of BCs: వెనుకబడిన కులాల వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నీలాద్రిపురంలో బీసీ సంఘాల ప్రతినిధులతో లోకేశ్ సమావేశమయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు అందించిన భరోసా, కల్పించిన ప్రయోజనాలను గుర్తుచేసిన లోకేశ్, వైసీపీ ప్రభుత్వం వచ్చాక బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు... ఈ ప్రభుత్వ విధానాల ద్వారా నష్టపోతున్న విధానాన్ని లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచితే, స్ధానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు తగ్గించి జగన్ మోసం చేశారని లోకేశ్ దుయ్యబట్టారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక... బీసీలకు గతంలో అమలుచేసిన అన్ని పథకాలను తిరిగి ప్రారంభిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. కొల్లేరులో చెరువుల సాగు... చేపలు, రొయ్యల పెంపకంపై ఆగడాళ్ళలంకకు చెందిన ఓ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ... ఈ విషయంలో పలువురితో చర్చించి వారంలో ప్రత్యేక సమావేశం ద్వారా పరిష్కారం సూచిస్తామని లోకేశ్ వల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details