ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lexus Car Show Room Opening in Guntur

ETV Bharat / videos

'ఒక్కసారి ఛార్జింగ్ పెడితే వెయ్యి కిలోమీటర్ల మైలేజ్​ ఇచ్చే కార్లను త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకొస్తాం' - ఏపీలో లెక్సస్​ కార్ల షోరూం తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 10:46 AM IST

Lexus Car Show Room Opening in Guntur :  గుంటూరు జిల్లా మంగళగిరిలో లెక్సస్ విలాస కార్ల షోరూంను ప్రారంభించారు. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఈ  షోరూంను  ఆరంభించినట్టు లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోని వెల్లడించారు.ఈ షోరూంలో రూ. 60 లక్షల నుంచి 3కోట్ల రూపాయల విలువైన లెక్సస్ కార్లు అందుబాటులో ఉన్నాయని నవీన్‌ సోని తెలిపారు. 2035నాటికి లెక్సస్ కార్లని విద్యుత్‌తో నడిచేలా మారుస్తామన్నారు. ఒక్కసారి ఛార్జింగ్​ పెడితే వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించే కార్లను త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకొస్తామని తెలిపారు.

Lexus Show Room Near By Viziawada :జపాన్​కు చెందిన ఈ లెక్సస్​ కార్లను భారత్​లో అభివృద్ధి చెయ్యడమే తమ లక్ష్యమని ఎండీ నవీన్​ తెలిపారు. మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ లెక్సెస్​ మెరాకీ, కార్ల రంగంలో ఆధిపత్యంలో ఉన్న జర్మనీ బ్రాండ్​లకు గట్టి పోటీ ఇవ్వనుందని లెక్సస్​ ఇండియా మేనేజింగ్​ డైరెక్టర్​ ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ సమీపంలో వారి ఐదవ షోరూం ప్రారంభించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details