భూ హక్కు చట్టం వల్ల చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టం : లోక్‌సత్తా బాబ్జీ - ap farmers rights
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2023, 5:12 PM IST
Land Rights Act :భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి విజయనగరం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ హక్కు చట్టం వల్ల చిన్న, సన్నకారుల రైతులు నష్టపోతారని తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వస్తే భూ వివాద విషయంలో కోర్టులు వెళ్లే అవకాశం లేదని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకి ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి భూమి హక్కుల అంతిమ నిర్ణయాన్ని సంబంధిత అధికారులకు ఇవ్వడం వల్ల పేద, దళితుల భూములు కబ్జాకు గురై అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
Demand to Repeal the Land Rights Act :దేశంలోనే ఇలాంటి తరహా భూ హక్కు చట్టాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు రాలేదని భీశెట్టి బాబ్జి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం వల్ల భూ వివాదాలు తగ్గించే విధంగా లేవని, ఇద్దరు వ్యక్తుల మధ్య అనవసర సమస్యలు సృష్టించే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ పై ప్రజలకి పూర్తి స్థాయిలో నమ్మకం లేని పరిస్థితిలో భూ వివాదాల పరిష్కార బాధ్యతలను తిరిగి వారికే అప్పగించడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎంపీలు ఈ చట్టం రద్దుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వత్తిడి తీసుకురావాలని కోరారు.