Kavali YCP Leaders Illegal Gravel Mining : దామవరం ఎయిర్ పోర్టు భూముల్లో వైసీపీ నేతల గ్రావెల్ తవ్వకాలు - ఏపీ వైసీపీ టీడీపీ నేతల వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2023, 11:34 AM IST
Kavali YCP Leaders Illegal Gravel Mining: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దామవరం ఎయిర్ పోర్టు భూముల్లో వైసీపీ నేతలు జగన్ అండతో గ్రావెల్ దోచేస్తున్నారని టీడీపీ నేత సుబ్బారాయుడు మండిపడ్డారు. కొద్ది రోజులుగా ఎవరినీ అనుమతించకుండా కావలి వైసీపీ నేతలు తవ్వకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎయిర్ పోర్టు భూముల్లో కావలి వైసీపీ నేతలు గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారని టీడీపీ నేత మండిపడ్డారు. సుబ్బారాయుడు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఆ ప్రాంతానికి తరలి వెళ్లారు. భారీగా తరలిపోతున్న వాహనాలను అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి రైతులు దగ్గర నుంచి గత ప్రభుత్వం 1100 ఎకరాల భూసేకరణ చేశారు. ఎయిర్ పోర్టు నిర్మాణ అంశాన్ని.. జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. అయినా ఈ భూముల్లో గ్రావెల్ తవ్వకాలు ఎలా చేస్తున్నారని టీడీపీ నేత ప్రశ్నించారు. రైతుల నుంచి సేకరించిన భూములను రైతులకు ఇవ్వాలని.. ఇలా తవ్వకాలు చేస్తే పంటల సాగుకు పనికిరావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ఆ భూముల్లో కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున అక్రమంగా గ్రావెల్, మట్టి తవ్వకాలు జరుపుతున్నారని సుబ్బానాయుడు మండిపడ్డారు.