JC Prabhakar Reddy Begging in Tadipatri : జేసీ వినూత్న నిరసన.. డ్రైనేజీ మరమ్మతుల నిధుల కోసం తాడిపత్రి వీధుల్లో భిక్షాటన! - ఏపీ రాజకీయ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2023, 7:21 PM IST
JC Prabhakar Reddy Begging in Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతుల కోసం మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి భిక్షాటన చేశారు. పట్టణంలోని వీధుల్లో, ఇంటింటికి తిరుగుతూ... డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడానికి వైసీపీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవని అందుకే ప్రజలు నుంచి సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి సేకరించిన సొమ్ముతోనే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటన చేపట్టారు. తాడిపత్రి ప్రాంత అభివృద్ధి గురించి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పట్టడం లేదనన్నారు. కేవలం పెద్దారెడ్డి అధికార దాహంతో పట్టణాన్ని నాశనం చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. డ్రైనేజీ పాడైపోయినా మరమ్మతు చేయటం కోసం వైసీపీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవన్నారు. అందుకే మున్సిపల్ చైర్మన్గా తన బాధ్యతను నిర్వర్తించటం కోసం ప్రజల దగ్గరకు వచ్చి భిక్షాటన చేసస్తున్నాని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.