Janasena Potina Mahesh: 'అమరావతిలో ఇళ్ల పట్టాలిచ్చింది వైఎస్సార్సీపీ నాయకులకు, వాలంటీర్లకే..' - ఎన్టీఆర్ జిల్లా లేటెస్ట్ న్యూస్
Janasena Potina Mahesh on Amaravati Plots distribution: రాజధాని అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలిచ్చింది పేద మహిళలకు కాదు.. వైఎస్సార్సీపీ నాయకులకు, వాలంటీర్లకు అని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన మహేశ్ ఆరోపించారు. అర్హుల జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మహిళలు లేరని.. వైఎస్సార్సీపీ నాయకులే ఉన్నారని అన్నారు. వైఎస్సార్సీపీ చెప్పే మాయమాటలను విజయవాడ నగరంలో మహిళలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన పేర్కొన్నారు. వెంకటపాలెం సభ కోసం విజయవాడ నగరంలో కార్పొరేషన్ అధికారులు ఆదివారం రాత్రి డ్యూటీ చేసి అష్ట కష్టాలు పడి బలవంతంగా బస్సులు నింపారన్నారు. సెంటు భూమి పథకంతో ప్రజలను మోసం చేస్తూ జక్కంపూడిలోని టిడ్కో గృహ సముదాయానికి గ్రహణం పట్టించారని మండిపడ్డారు. పెత్తందారులు అనే పదాన్ని తనలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలంటే బాగుంటుందని, కానీ లక్ష కోట్లు, నాలుగు ప్యాలెస్లున్న సీఎం జగన్ అంటే బాగుంటుందా..?అని ప్రశ్నించారు.