ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Janasena_Leaders_Agitation

ETV Bharat / videos

Janasena Leaders Agitation అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్​పై భూ ఆక్రమణలపై.. జనసేన ఆందోళన - మంత్రి అమర్‌నాథ్‌ భూ ఆక్రమణలు

By

Published : Aug 7, 2023, 9:35 PM IST

Janasena Leaders Agitation: అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విస్సన్నపేటలో జరిగిన భూ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి.. ప్రభుత్వ భూములను కాపాడాలంటూ జనసేన పార్టీ నాయకులు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో భూ ఆక్రమణలపై స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా.. జిల్లా కలెక్టర్, అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, అతని అనుచరులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు పట్టించుకోకుండా వ్యవహరించడం తగదని మండిపడ్డారు. విస్సన్నపేటలో 609 ఎకరాల్లో లేఅవుట్ వేస్తున్నారని.. దీంట్లో చాలా వరకూ ప్రభుత్వ భూమి ఆక్రమించారని తాము సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. వారాహి మూడో విడత యాత్రలో భాగంగా విశాఖపట్నం వస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విస్సన్నపేటలోని భూములను పరిశీలించి వైసీపీ భూ దోపిడీని ఎండగడతారని వివరించారు. దీన్ని అడ్డుకోవడానికి 30 పోలీస్ యాక్ట్​ని అమలు చేస్తున్నారని.. ఎన్ని ఆటంకాలు సృష్టించాలని చూసినా అధికార పార్టీ అక్రమాలను ప్రజలకు వివరించేలా జనసేన పోరాడుతుందని ఆ పార్టీ నేత దూలం గోపి తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details