సింహాద్రి అప్పన్న సేవలో భారత క్రికెటర్లు- మ్యాచ్కు ముందు పూజలు - Indian cricketers at Simhachalam temple
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 1:29 PM IST
Indian Cricketers visited Simhadri Appanna:నేడు విశాఖలో ఆస్ట్రేలియాకు- భారత్కు తొలి టీ-20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో భారత క్రికెటర్లు విశాఖ చేరుకున్నారు. ఈ క్రమంలో టీం సభ్యులంతా సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భారత్ క్రికెట్ ఆటగాళ్లు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, టీం సభ్యులు పాల్గొన్నారు. జట్టు సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దేవస్థానం పూజారులు.. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల తర్వాత క్రికెటర్లు.. ఆలయంలో కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అందరికీ తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలు అందించారు. ఆస్ట్రేలియాతో సాయంత్రం జరిగే టీ-20 మ్యాచ్‌లో విజయం సాధించాలని స్వామివారిని వేడుకున్నారు. క్రికెటర్లతో ఫొటోలు దిగడానికి అభిమానులు ఉత్సాహం చూపారు. వరల్డ్ కప్ తరువాత భారత్కు ఆస్ట్రేలియాకు జరుతున్న మ్యాచ్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే మ్యాచ్ కోసం వైజాగ్ స్టేడియంలో అంతా సిద్ధం చేసినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది.