ఆంధ్రప్రదేశ్

andhra pradesh

illegal_mining

ETV Bharat / videos

రైతుల ఫ్లాట్లనూ వదలని మాఫియా - మట్టి తరలించిన దుండగులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 9, 2024, 4:03 PM IST

Illegal Movement of Soil in Flats Given to Farmers : రాజధాని ప్రాంతంలో మట్టి దొంగలు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం తెల్లవారుజామున తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఫ్లాట్లలో మట్టి తవ్వుతుండగా రైతులు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా ఉద్ధండరాయన పాలెం కు చెందిన కొంతమంది అక్రమంగా మట్టి తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. స్థానికులు సమాచారం ఇవ్వగా వారు వచ్చి జేసీబీ, టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు.
Illegal Soil in Capital City : రాష్ట్రంలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా, ఇసుక రీచ్​లను స్వాహా చేయడం, గ్రావెల్ తోడేయడం ఇప్పుడు రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో మట్టిని కూడా వదలడం లేదు. రాష్ట్రంలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుటికైనా అధికారులు స్పందించి అక్రమాలకు అడ్డుకట్ట వేసి సహజ వనరులను రక్షించాలని కోరుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details