I Pac Team in Yuvagalam: "లోకేశ్ పాదయాత్రలో ఐప్యాక్ సభ్యులు.. వైసీపీ దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనం" - లోకేష్ పాదయాత్ర
I Pac Members in Yuvagalam Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈరోజు లోకేశ్ యువగళం పాదయాత్రలో ఐప్యాక్ సభ్యుల్ని తెలుగుదేశం శ్రేణులు పట్టుకున్నారు. కనిగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర పై ఐ ప్యాక్ సభ్యులు నిఘా పెట్టారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. లోకేశ్ పాదయాత్రకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు బయటికి చేరవేస్తుండగా యువగళం బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఒకడిని పట్టుకోగానే ఇతర సభ్యులు అక్కడి నుంచి పరారైయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనం అని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. కవ్వింపు చర్యలు, కుట్రలు పన్నెలా ఐప్యాక్ సభ్యులు యువగళంలోకి చొరబడుతున్నారని తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా యువగళం పాదయాత్ర కనిగిరి నియోజకవర్గం అజీస్పురంలో 2100 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో నారా లోకేశ్ శిలాఫలకం ఆవిష్కరిస్తారు.