ఆంధ్రప్రదేశ్

andhra pradesh

House_Owner_Locked_the_Ward_Secretariat_Building

ETV Bharat / videos

'సమస్యపై స్పందించని అధికారులు' - సచివాలయ భవనానికి తాళం వేసిన భవన యజమాని - Sri Sathya Sai District News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 4:41 PM IST

House Owner Locked the Ward Secretariat Building :సచివాలయ భవనానికి ఏడు నెలలుగా అద్దె చెల్లించడం లేదంటూ శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని సచివాలయ భవనానికి ఇంటి యజమాని తాళం వేశారు. హిందూపురం మున్సిపల్ పరిధిలోని నాలుగవ వార్డు సచివాలయాన్ని అద్దె ఇంట్లో ఏర్పాటు చేశారు. అయితే గత ఏడు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో.. భవన యజమాని సచివాలయం వద్దకు వెళ్లి.. అద్దె చెల్లించాలని లేకుంటే భవనం ఖాళీ చేయాలని డిమాండ్ చేశాడు.  

అధికారుల నుంచి  ఏలాంటి స్పందన లేకపోవడంతో సచివాలయ సిబ్బందిని బయటకు పంపి యజమాని తాళం వేశారు. తన భవనానికి వచ్చే అద్దె కుటుంబానికి జీవనాధారమని తెలిపాడు. అయితే ఏడు నెలలుగా అద్దె చెల్లించకుండా మొహం చాటేస్తున్నారని వాపోయాడు. ఆగస్టు 30 తేదికే భవన అగ్రిమెంట్ పూర్తి అయ్యింది.. అప్పటి నుంచి ఖాళీ చేయ్యమని చెబుతున్నా వినడం లేదన్నారు. నెలకు రూ.6000 లాగా ఏడు నెలల అద్దె రావాలని తెలిపాడు. చివరికి కమిషనర్​కి చెప్పిన లాభం లేక పోవడంతో .. సచివాలయం అధికారుల సమక్షంలోని తాళం వేసినట్టు భవన యజమాని తెలిపాడు.  

ABOUT THE AUTHOR

...view details