ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Heat Waves in AP

ETV Bharat / videos

Heat Waves in AP ఏపీలో భానుడి ఉగ్రరూపం!.. ఈ మూడు రోజులు ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండండి!

By

Published : Jun 2, 2023, 2:24 PM IST

High Temperatures in AP: ఓ వైపు ఎండలు.. మరోవైపు అకాస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు రాష్ట్ర ప్రజలను ఇబ్బందిపెడుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎండ వేడి నుంచి తట్టుకుని.. వర్షాలకు సేదతీరుతున్న ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ మరో పిడుగు లాంటి విషయం వెల్లడించింది. రాష్ట్రంలో మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 286 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 47 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు.. 17 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 300 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండొచ్చని స్పష్టం చేసింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా బాలింతలు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అత్యవసం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details