ఆంధ్రప్రదేశ్

andhra pradesh

High_Court_Orders_on_Land_Encroachment

ETV Bharat / videos

High Court Orders on Land Encroachment 'మూడు నెలల్లో.. ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోండి' - ఏపీ తాజా వార్తలుట

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2023, 12:18 PM IST

High Court Orders on Land Encroachment in Brahmanapalle: పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లెలోని 175 ఎకరాల ప్రభుత్వ, ఎసైన్డ్‌ భూములను మాల్పూరి ఆగ్రోటెక్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ, M.L.A. బొల్లా బ్రహ్మనాయుడి శ్రీ వత్స ఫుడ్‌పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు ఆక్రమించాయని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రభుత్వ భూముల రక్షణ కోసం హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగానే ఇప్పుడు వ్యవహరించాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌, తదితర అధికారులకు స్పష్టం చేసింది. ప్రభావిత వ్యక్తులకు ముందుగా నోటీసు ఇవ్వాలని.. విచారణ పూర్తి చేసి మూడు నెలల్లో ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ, ఎసైన్డ్‌ భూములను కాపాడాలంటూ వినుకొండకు చెందిన కీర్తిపాటి వెంకటేశ్వర్లు హైకోర్టులో పిల్‌ వేశారు. గతంలో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం శ్రీవత్స ఫుడ్‌పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీ, వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాల్పూరి ఆగ్రోటెక్‌ సంస్థ ఎండీ లక్ష్మణస్వామి తదితరులకు నోటీసులు జారీచేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details