ఆంధ్రప్రదేశ్

andhra pradesh

High_Court_Hearing_on_Narayana_Son_in_Law_Petition

ETV Bharat / videos

High Court Hearing on Narayana Son-in-Law Petition: అమరావతి రింగ్ రోడ్ కేసు.. పునీత్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట - Amaravati Inner Ring Road Case updates

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 9:09 PM IST

High Court Hearing on Narayana Son-in-Law Petition:అమరావతి రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో స్వల్ప ఊరట లభించింది. సీఐడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ.. పునీత్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. విచారణలో భాగంగా పునీత్‌ను బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు న్యాయవాది సమక్షంలో విచారించాలని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

Hearing on Narayan Petition Tomorrow: అమరావతి రింగ్ రోడ్ కేసుకు సంబంధించి.. ఈనెల 11న విచారణకు రావాల్సిందిగా సీఐడీ అధికారులు మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌కు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో సీఐడీ తనకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ.. పునీత్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అనంతరం అమరావతి రింగ్ రోడ్‌ కేసులో మాజీ మంత్రి నారాయణ సీఐడీ నోటీసులపై దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. పిటిషన్‌లో.. ఆరోగ్య కారణాలను పరిగణలోకి తీసుకుని తనను ఇంటి వద్దే విచారించాలని నారాయణ కోరారు.

ABOUT THE AUTHOR

...view details