ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CBN_Anticipatory_Bail_petition_in_IRR

ETV Bharat / videos

High Court Hearing on CBN Anticipatory Bail petition in IRR: 'రింగ్‌ రోడ్డు కేసు'లో చంద్రబాబు బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా - Andhra Pradesh high court news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 3:43 PM IST

Updated : Oct 18, 2023, 9:45 PM IST

High Court Hearing on CBN Anticipatory Bail petition in IRR: అమరావతి రింగ్ రోడ్ కేసుకు సంబంధించి.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో బుధవారం విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున కేసు విచారణను హైకోర్టు న్యాయమూర్తి నవంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు. 

Hearing on CBN Anticipatory Bail Petition Adjourned: అమరావతి ఇన్నర్‌ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను రాష్ట్ర హైకోర్టు నవంబర్ 7కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉన్నందున కేసుని వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. మరోవైపు అమరావతి రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి.. సీఐడీ అధికారులు గతంలో విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ను దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ (పీటీ వారెంట్) విచారణపై స్టే విధించిన హైకోర్టు.. గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ఉత్తర్వులను నవంబర్ 7వరకు పొడిగించింది.

ఏసీబీ కోర్టులో ఫైబర్​ నెట్​ కేసు: ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్‌పై నిర్ణయం ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది. చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరచాల్సి ఉండడంతో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ఇదివరకే ప్రకటించింది. ఈలోగా బాబును అరెస్టు చేయొద్దని సీఐడీ తరఫు న్యాయవాదులకు సూచించింది. దీంతో చంద్రబాబు పీటీ వారెంట్‌పై నిర్ణయాన్ని 20కి వాయిదా వేస్తూ.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

Last Updated : Oct 18, 2023, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details