మూడు నెలలుగా అద్దె బకాయి - అడిగితే కేసు పెడతామని బెదిరింపులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 7:05 PM IST
Government Liquor Shop Locked: బాపట్ల జిల్లా అద్దంకిలో ప్రభుత్వ మద్యం దుకాణం అద్దె చెల్లించకపోవటంతో యజమాని ఏడుకొండలు షాపుకు తాళం వేశారు. మూడు నెలలుగా అద్దె చెల్లించక పోవటంతో షాపులో ఉన్న సిబ్బందిని బయటకు పంపించి తాళాలు వేశారు. సెప్టెంబర్‌తో అగ్రిమెంట్ పూరైందని, షాపు ఖాళీ చేయమని చెబితే ఖాళీ చేయడం లేదని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.
Owner Locked Liquor Shop Due to Non Payment of Rent: నెలకు షాపు అద్దె రూ.15వేలని, 3నెలల అద్దె రూ.45వేలు ఇవ్వాలని ఏడుకొండలు కన్నీటి పర్యంతమయ్యారు. షాపు ఖాళీ చేయమని అడిగితే తనపైనే కేసులు పెడతానని బెదిరిస్తున్నారని తెలిపారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని షాపు యజమాని వాపోయారు. తనకు రావలసిన అద్ధె బకాయి వస్తే కాని షాపు తాళాలు తీయనని ఏడుకొండలు తెలిపారు. మద్యం అమ్మకాలు జరుపుకుంటూ, షాపు ఖాళీ చేయమంటే చేయకుండా అద్దె చెల్లించటం లేదని యజమాని వాపోయారు. అద్దె చెల్లించకుంటే మేము ఎలా జీవించాలని ఏడుకొెండలు ఆగ్రహం వ్యక్తం చేశారు.