Flexi Tension in Addanki: అర్థరాత్రి వేళ అలజడి.. ఫ్లెక్సీ వివాదంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ - తెదేపా ఫ్లెక్సీ సమస్య
Flexi Tension in Addanki: బాపట్ల జిల్లా అద్దంకి భవానీ సెంటర్‌లో యువగళం పాదయాత్ర కటౌట్ ఏర్పాటు సందర్భంగా వివాదం నెలకొంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడే ఉన్న వైకాపా నేత ఫ్లెక్సీని చింపేశాడు. విషయం తెలుసుకున్న వైకాపా శ్రేణులు భవాని సెంటర్కు వచ్చి రాస్తారోకో చేశారు. ఫ్లెక్సీని చించింది తెలుగుదేశం వర్గీయులేనంటూ నామ్ రహదారిపై బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వైయస్ఆర్సీపీ శ్రేణులను ఏమీ అనకుండా.. అక్కడే ఉన్న తెదేపా నాయకులపై మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ...తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. బలగాలను మోహరించిన పోలీసులు ఇరువర్గాలతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరో ఆకతాయి చేసిన పనికి ఇటు అధికార పక్షానికి.. అటు ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేక పోలీసులు డీలా పడ్డారు. చివరికి చినిగిన ఫ్లెక్సీని సరిచేయడంతో వివాదం సద్దుమణిగింది.