Boy suspicious death: పెందుర్తిలో విషాదం.. ఐదేళ్ల బాలుడు అనుమానాస్పద మృతి - pendurthi crime news
boy died under suspicious: పెందుర్తి మండలం ఎస్ఆర్ పురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడు తేజ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తమ కుమారుడు కనిపించటం లేదని తల్లిదండ్రులు గురువారం రాత్రి పది గంటలకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే లారీ యార్టులో బాలుడు మృతదేహం లభ్యమైంది. తేజ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అల్లారు ముద్దుగా ఉండే బాలుడు విగత జీవిగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు తట్టుకోలేక పోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కుమారుడు మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. పెందుర్తి ఏసీపీ నరసింహమూర్తి మాట్లాడుతూ.. బాలుడి నోట్లోంచి నురగలు వస్తున్నాయని, చేతులకు ఘాట్లు ఉన్నాయని అన్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతి గల కారణాలు తెలుస్తాయని ఏసీపీ తెలిపారు. రోజు ఆడుతూ పాడుతూ ఉండే బాలుడు చిరు ప్రాయంలో మృతి చెందడం పట్ల గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.