ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Fishermen communities are angry over Repalle YCP incharge change

ETV Bharat / videos

'వైసీపీ గద్దె దిగేవరకు పోరాడతాం' - మోపిదేవికి మద్దతుగా మత్స్యకార సంఘాల సమావేశం - రేపల్లే వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 4:00 PM IST

Fishermen communities are angry over Repalle YCP incharge change: రేపల్లె వైసీపీ ఇన్‌ఛార్జిగా మోపిదేవి వెంకట రమణను తప్పించడంపై, మత్స్యకార సంఘాలు మండిపడుతున్నాయి. రేయింబవళ్లు కష్టపడి  జగన్‌ను గెలిపిస్తే, ఇదేనా మత్య్సకారులకు ఇచ్చిన గౌరవమని మండిపడ్డారు. తాడేపల్లిలోని ఓ హోటల్ లో మత్య్సకార సంఘాల నేతలు సమావేశమయ్యారు. రేపల్లె వైకాపా ఇన్‌ఛార్జ్‌గా మోపిదేవిని తిరిగి కొనసాగించాలని లేకపోతే మత్య్సకారులంతా ఏకమై వైకాపాను గద్దె దిగేంతవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మత్స్యకారులకు కేటాయించిన సీట్లలో వారినే కొనసాగించాలని, మత్స్యకార సంఘాలు డిమాండ్ చేశారు. 

తమ సామాజిక వర్గానికి రాజకీయంగా అన్యాయం జరుగుతుందని,  కంటి తుడుపు చర్య కింద ఒకటి, రెండు సీట్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని మత్స్యకార సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్య్సకారుల సమస్యలపై స్పందించే మోపిదేవిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఆయనను పక్కన పెట్టాలని చూస్తే రాజకీయంగా వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో మత్య్సకారులు గెలిపించుకోగలిగే 20 ప్రాంతాలు ఉన్నాయని, కానీ, ఒక్క ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఇచ్చి సరిపెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి మత్స్యకార సామాజిక వర్గంలోని 14 ఉప కులాల నేతలు హాజరయ్యారు. 

ABOUT THE AUTHOR

...view details