ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Fire_Accident_in_Chittoor_District

ETV Bharat / videos

చిత్తూరు జిల్లాలో అగ్ని ప్రమాదం - భారీ ఆస్తి నష్టంపై బాధితుల ఆవేదన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 12:57 PM IST

Fire Accident in Chittoor District: చిత్తూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వి.కోట పట్టణంలో సోఫాలు తయారు చేసే షెడ్డులో మంటలు చెలరేగగా.. సమీపంలో ఉన్న కోళ్ల ఫారానికి మంటలు వ్యాపించాయి. మంటలు క్షణాల వ్యవధిలోనే పెరగడంతో .. తయారీ సామగ్రి కాలి బూడిదైపోయింది. ఇది గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసు అధికారులకు సమాచారం అందించారు. 

Fire Broke Out in Sofa Manufacturing Shed: స్థానికంగా ఫైర్‌ స్టేషన్‌ అందుబాటులో ల‌ేకపోవడంతో.. కుప్పం అగ్నిమాపక సిబ్బందికి పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనలో సుమారు 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. భారీ ఆస్తినష్టంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరిశీలనలు చేపట్టారు. ఈ ప్రమాదం షార్ట్‌ సర్కూట్‌(Short Circuit) ద్వారా జరిగిందా.. ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో.. పోలీసులు విచారణ చేపట్టారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు.

ABOUT THE AUTHOR

...view details