ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ferro Alloys Company Closed

ETV Bharat / videos

Ferro Alloys Company Closed: మూతపడిన మరో ఫెర్రో ఎల్లాయ్స్​ పరిశ్రమ.. రోడ్డున పడ్డ వందలాది కార్మికులు

By

Published : Jul 7, 2023, 1:26 PM IST

Updated : Jul 7, 2023, 5:08 PM IST

Ferro Alloys Company Closed in Vizianagaram: విజయనగరం జిల్లాలో మరో ఫెర్రో ఎల్లాయ్స్‌ పరిశ్రమ మూతపడింది. కొత్తవలస మండలం చింతలపాలెంలోని మెసర్స్‌ డెక్కన్‌ ఫెర్రో ఎల్లాయ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. విద్యుత్తు ఛార్జీలు భారీగా పెంచడం వల్ల పరిశ్రమలో కార్యకలాపాలు ఈ నెల 2వ తేదీ నుంచి నిలిపివేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మికి యాజమాన్యం జూన్‌ 27న పంపిన లేఖలో పేర్కొంది. అందుకు అనుగుణంగా పరిశ్రమను మూసివేసి గేటుకు బోర్డు పెట్టారు. అసాధారణంగా విద్యుత్తు టారిఫ్‌ పెంచడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతోందని లేఖలో పేర్కొన్నారు. ఉత్పత్తి చేసిన ఫెర్రో ఎల్లాయ్స్‌ ధరలు స్థానికంగా క్షీణిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని ఫెర్రో పరిశ్రమలతో పోటీ పడలేకపోతున్నామని వివరించారు. ఈ సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపేవరకూ పరిశ్రమ మూసివేస్తున్నట్లు కలెక్టర్‌తో పాటు కార్మిక శాఖ ఉప కమిషనర్‌, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం, ఇతర అధికారులకు ఆ లేఖ నకళ్లు పంపారు. ఈ పరిశ్రమ మూతతో 100 మంది శాశ్వత కార్మికులు, సుమారు మరో వంద మంది వరకు ఒప్పంద కార్మికులు ఉపాధి కోల్పోయారు. 

పరిశ్రమ పరిశ్రమలకు పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించి పరిశ్రమల మీద ఆధారపడి జీవనోపాధి పొందుతున్న కార్మికులను ఆదుకోవాలని చీపురుపల్లి ఆర్డీవోకు కార్మిక నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. పరిశ్రమలు లాకౌట్ ఎత్తివేసి.. విద్యుత్ చార్జీలు తగ్గించి పరిశ్రమల మీద ఆధారపడి కుటుంబాలను ఆదుకోవాలని కార్మిక సంఘ నేత గౌరనాయుడు కోరారు. 

Last Updated : Jul 7, 2023, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details