Venkatapalem Farmers ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చాలి.. కౌలు చెల్లించాలని ఎస్సీ రైతుల ఆందోళన - ముఖ్యమంత్రి జగన్ తమకు ఇచ్చిన హామీ
Venkatapalem Farmers రాజధాని ప్రాంతంలో ఎస్సీ రైతులకు వెంటనే కౌలు చెల్లించాలని వెంకటపాలెంలో రైతులు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద రైతుల నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తమకు ఇచ్చిన హామీలలో భాగంగా జరీబు భూములకు సమానంగా అసైన్డ్ రైతులతు ప్యాకేజీ ఇవ్వాలని, కూలీలకు ఇచ్చే నెల పెన్షన్ 2500 నుంచి 5వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ రెండు హామీలు వెంటనే నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రెండు డిమాండ్ లను నెరవేరుస్తామని మాకు స్పష్టమైన హామీ ఇవ్వటం వల్లే వైఎస్సార్సీపీని గెలిపించాలని రైతులు చెప్పారు. గత మూడేళ్లుగా కౌలు రాకపోవటంతో తమ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు వాపోయారు.
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసైన్డ్ రైతులకు కూడా ప్యాకేజీ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఆనాడు హామీ ఇవ్వబట్టే ఊరూరా తిరిగి వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేసి ఓట్లు వేయించాం. కానీ, ఇపుడు ఎన్నిసార్లు విజ్ఞాపన చేసినా పట్టించుకోవడం లేదు. వ్యవసాయ కూలీలకు పింఛన్ 5వేలకు పెంచాలి.- పులి ప్రభుదాస్, అసైన్డ్ రైతు, వెంకటపాలెం