బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు - అదే సమయంలో ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతి - ట్రాక్టరు ఢీకొట్టి రైతు మృతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 2:24 PM IST
Farmer Died In Road Accident in Anantapur District : రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది. బాధితుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామానికి చెందిన రమేష్, సంజప్ప ఇద్దరూ ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం మీద స్వగ్రామానికి వెళ్తుండగా అదుపు తప్పి ఉరవకొండ పట్టణ శివారు శాలివాహన కాలనీ వద్ద వారి వాహనం బోల్తా పడింది.
Tractor Hits Man On Anantapur Road :ఈ క్రమంలో రమేష్తో పాటు ఆ కాలనీకి చెందిన గాదిలింగ, సంజప్పకు సపర్యలు చేస్తుండగా వెనక నుంచి వచ్చిన ట్రాక్టరు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంజప్ప (65) అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఇద్దరికీ గాయాలయ్యాయి. మృతుడు వ్యవసాయం చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమారైలు ఉన్నారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.