ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హోంగార్డు ఉద్యోగాల పేరుతో మోసాలు - కోనసాగుతున్న అరెస్టులు

ETV Bharat / videos

హోంగార్డు ఉద్యోగాల పేరుతో మోసాలు - కొనసాగుతున్న అరెస్టులు - Scams for name of jobs

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 11:01 PM IST

Fake Home Guard Jobs in Guntur District : హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన కేసులో అరెస్టులు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా ఈ కేసులో ఏ3గా ఉన్న విజయలక్ష్మి పండిట్, ఏ4గా ఉన్న గొల్లమూడి వెంకటలక్ష్మి, నరసింహ, ఫణికుమార్​లను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్​లో మంగళవారం అదుపులోకి తీసుకున్న వీరిని బుధ, గురువారల్లో విచారించారు. అనంతరం గురువారం సాయంత్రం మంగళగిరి న్యాయస్థానంలో వీరిని ప్రవేశపెట్టగా న్యాయమూర్తి వీరికి 14రోజుల రిమాండ్ విధించారు. 

ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా తదుపరి ఉత్తర్వులు ఇవ్వాలంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పూర్తి వివరాలను 15 రోజుల్లో ఇవ్వాలంటూ న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి ఏ8గా ఉన్నారు. ఈ కేసును త్వరగా పూర్తిచేసి నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details