EX CS IYR Krishna Rao: "కూలీలు ఇతర రంగాల్లో కూడా నైపుణ్యతను సాధించేలా శిక్షణ అందించాలి" - రైతు కూలీలపై సామాజిక ఆర్ధిక సర్వే
EX CS IYR Krishna Rao on Farmers Problems:రైతుకూలీలు ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. గోపాలరావు ఠాకూర్ స్మారక సమితి ఆధ్వర్యంలో రైతు కూలీలపై జరిపిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికను విజయవాడ ఐలాపురంలో ప్రారంభించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . వారికి ఎటువంటి భద్రత లేదన్నారు. భూమిలేని రైతు కూలీలను అత్యంత పేద వర్గంగా గుర్తించి వీరి అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు. కూలీల కుటుంబాలకు ఆరోగ్యం, విద్యను అందించాలన్నారు. కేవలం వ్యవసాయరంగంలోనే కాకుండా వారికి ఇతర పనుల్లో నైపుణ్యతను సాధించే దిశగా శిక్షణ నివ్వాలని కోరారు . ప్రస్తుతం వ్యవసాయ రంగంలో భారీ పనిముట్లు రావటంతో కూలీల ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుందన్నారు. వారికి ఇతర రంగాల్లో కూడా ఉపాధి కల్పించేందుకు తగిన శిక్షణనివ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 మండలాల్లో 112 గ్రామాల్లో 400 మందికి పైగా కుటుంబాల్లో గోపాలరావు ఠాకూర్ స్మారక సమితి ఆధ్వర్యంలో సర్వే చేసి.. సామాజిక ఆర్ధిక పరిస్థితులను తెలుసుకున్నారన్నారు. సర్వే నివేదికను విడుదల చేశారు . రైతు కూలీల అభ్యున్నతికి భారతీయ రైతు కూలీల సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు