Prathidhwani: కోడికత్తి దాడి ఘటనలో జగన్ చొక్కా ఎందుకు చిరగలేదు? - కోడికత్తి నిందితుడు శ్రీనివాస్
Prathidhwani రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రచారం కోసం, సానుభూతి కోసం నడిపించిన డ్రామా బట్టబయలు అయింది. ఇందులో కుట్ర, కుతంత్రాలు ఏమీ లేవు. తెలుగుదేశానికి ఈ ఘటనతో సంబంధమే లేదని తేలింది. వైసీపీ డిమాండ్ చేసిన జాతీయ దర్యాప్తు సంస్థే ఈ విషయాన్ని ప్రకటించింది. జగన్‌పై ఆ రోజు విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి చేసింది వైసీపీ అభిమాని అని విచారణలో తేలింది. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యుల తమ పరిస్థితి ఇదీ అని చెబుతున్న మాటలు ఇవి. అతడి కుటుంబాన్ని ఏవైనా ప్రభుత్వం ఆదుకుందా? ఆ రోజు ఏపీ ప్రభుత్వం కోడికత్తి దాడి విషయంలో ఏం ప్రకటన చేసిందో. చివరికి ఎన్ఐఏ కూడా దాదాపు అదే తేల్చింది? నిజంగా జగన్‌పై హత్యాయత్నం జరిగి ఉంటే తానే సీఎంగా ఉన్న ఈ కేసు ఎందుకు ఇంతకాలం పట్టింది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.