Secretariat CPS association on GPS: జీపీఎస్‌పై సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సమావేశం..
Secretariat CPS association on GPS: జీపీఎస్‌ను వెనక్కు తీసుకోవడంతో పాటు.. సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 26 తేదీన మంత్రుల కార్యాలయాల్లో విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు సీపీఎస్ ఉద్యోగుల సాధారణ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం.. కేబినెట్లో సీపీఎస్ స్థానంలో జీపీఎస్‌ను ప్రతిపాదించటంపై చర్చ జరిపింది. కేబినెట్లో ఆమోదించిన జీపీఎస్‌ను వెనక్కు తీసుకోవాలని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పాత పెన్షన్ పునరుద్ధరించటమే దీనికి ప్రత్యామ్నాయం అని సమావేశంలో పేర్కొంది. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలుపై సీపీఎస్ సంఘాలతోనే చర్చించాలని తేల్చి చెప్పింది. సీపీఎస్ రద్దుపై సీపీఎస్ ఉద్యోగుల సంఘాలతో ఐక్యపోరాటం చేయాలని నిర్ణయించింది. జీపీఎస్‌కు అనుకూలంగా మాట్లాడేవారి వ్యాఖ్యలను ఖండిస్తూ మరో తీర్మానం చేసింది. ఈ నెల 26 వరకు సీపీఎస్ రద్దుపై స్పందనలో వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జులై 8న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ వెల్లడించింది.