ఆంధ్రప్రదేశ్

andhra pradesh

dulipally_fires_on_appalraju_in_gunrut

ETV Bharat / videos

'సీఎం జగన్ ఆస్తిని ప్రభుత్వానికి రాసిస్తే, సంగం డైయిరీని సహకార రంగంలో కలుపుతా' - సంగం డైరీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 11:53 AM IST

Dulipally Fires on Appalraju in Gunrut : రాష్ట్ర ప్రజల సొమ్మును వైసీపీ ప్రభుత్వం అమూల్ కోసం ఖర్చు పెడుతోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలకు గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హెరిటేజ్‌ను ప్రభుత్వానికి రాసివ్వాలని మంత్రి అప్పలరాజు అంటున్నారు కదా జగన్ సంపాదించిన 43వేల కోట్ల రూపాయల ఆస్తిని ప్రభుత్వానికి రాసిస్తారా? అని అడిగారు. అప్పలరాజు సీఎం జగన్ చేత ఆయన ఆస్తిని ప్రభుత్వానికి రాసిస్తే తాము కూడా సంగం డైయిరీని సహకార రంగంలో కలుపుతానని మంత్రి అప్పలరాజుకి ఛాలెంజ్ విసిరారు.

Dulipally Press Meet on Appalraju Comment : తండ్రి అధికాన్ని అడ్డంపెట్టుకుని జగన్​ రూ. 43వేల కోట్లు దోచుకున్నాడని సీబీఐ స్పష్టంగా చెప్పిందని ధూళిపాళ్ల అన్నారు. ప్రజల ధనాన్ని అడ్డగోలుగా  అమూల్​ అభివృద్ధి కోసం కర్చుపెడుతున్నారన్నారు. కానీ దాని వల్ల ప్రజలకు ఎలాంటి లాభం చేకురలేదని మండిపడ్డారు.  

ABOUT THE AUTHOR

...view details