ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Doubt Clearance Bot for AP Govt School Students

ETV Bharat / videos

Doubt Clearance Bot for AP Govt School Students: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 'డౌట్ క్లియరెన్స్ బాట్'.. విద్యాశాఖ ఉత్తర్వులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2023, 12:45 PM IST

Doubt Clearance Bot for AP Govt School Students: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు చాట్​బాట్ (Chatbot) పేరిట ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల డిజిటలైజేషన్​ ప్రక్రియలో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాట్​బాట్ అందుబాటులోకి తెచ్చేలా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొబైల్ యాప్ ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్​బాట్ పని చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. 

ఈ మేరకు కాన్వే జీనియస్ (ConveGenius) ఏఐ సొల్యూషన్స్ సంస్థతో ఒప్పందం కుదిరిందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ (AP Education Principal Secretary Praveen Prakash) పేర్కొన్నారు. విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్​లు, పాఠశాలలలో స్మార్ట్ బోర్డుల ద్వారా ఏఐ సందేహ నివృత్తి చాట్​బాట్ అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తరగతి వేళలు ముగిసిన అనంతరం ఈ చాట్​బాట్ ద్వారా విద్యార్థులు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details